సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సమంత 'పుష్ప'లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఆ ఇద్దరేనా..?

ABN, First Publish Date - 2021-12-30T14:57:02+05:30

సమంత 'పుష్ప'లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఆ ఇద్దరేనా..? అని ఓ వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఆ ఇద్దరు ఎవరంటే మెగా స్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమంత 'పుష్ప'లో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఆ ఇద్దరేనా..? అని ఓ వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఆ ఇద్దరు ఎవరంటే మెగా స్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అక్కినేని నాగ చైతన్య నుంచి సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత చైతూ సైలెంట్‌గా ఉన్నా కూడా సమంత మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో కామెంట్స్ పెట్టి హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, ఈ సమయంలో నెటిజన్స్ చేసిన విపరీతమైన ట్రోల్స్‌ను ఫేస్ చేసింది. చాలామంది సమంతనే నెగిటివ్‌గా కామెంట్ చేసి సోషల్ మీడియాలో - యూట్యూబ్ ఛానళ్ళలో రక రకాల వార్తలు ప్రసారం చేశారు. దాంతో, తాను తీవ్ర మనస్తాపానికి గురైంది. సరిగ్గా అదే సమమ్యంలో దీపావళి పండుగ రావడం..మెగా ఫ్యామిలీలో చేరి ఉపాసనతో కలిసి తన బాధలు పంచుకోవడం జరిగిందట. ఈ విషయం తెలుసుకున్న మెగా హీరోలు చిరంజీవి, చరణ్ సమంతను ఓదార్చి..ఇలా వదిలేస్తే ఆమె మరింతగా మానసిక ఒత్తిడికి లోనవుతుందని భావించి 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసేలా మాట్లాడి ఒప్పించారట. మళ్ళీ సినిమాల పరంగా సమంత బిజీ అయితేనే ఈ ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉందని సుకుమార్‌తో మాట్లాడి 'పుష్ప' చిత్రంలో ఉన్న మాస్ నంబర్ 'ఊ అంటావా మావా' సాంగ్ చేసే అవకాశం కల్పించినట్టు ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే నిమైతే చిరు, చరణ్ తీసుకున్న ఈ చొరవ సమంత కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడిందనడంలో సందేహమే లేదు. 

Updated Date - 2021-12-30T14:57:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!