సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఫన్ డైరెక్టర్‌తో బాలయ్య..?

ABN, First Publish Date - 2021-05-04T13:49:19+05:30

నందమూరి నటసింహం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది నుంచే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ..'రామారావు' టైటిల్ అనుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమా సీక్వెల్ 'ఎఫ్ 3' మొదలు పెట్టడంతో బాలయ్యతో అనిల్ రావిపూడి కాంబోలో సినిమా గురించి వార్తలు ఆగిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి నటసింహం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది నుంచే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని ..'రామారావు' టైటిల్ అనుకుంటున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అయితే 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమా సీక్వెల్ 'ఎఫ్ 3' మొదలు పెట్టడంతో బాలయ్యతో అనిల్ రావిపూడి కాంబోలో సినిమా గురించి వార్తలు ఆగిపోయాయి. కానీ ఇటు అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' షూటింగ్ అలాగే బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం 'అఖండ' షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మళ్ళీ బాలయ్య - అనిల్ రావిపూడిల సినిమా గురించి చర్చలు మొదలయ్యాయి. బాలయ్య - బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా 'అఖండ' ఈ నెల 28న రిలీజ్ కావాల్సి ఉంది. కోవిడ్ పరిస్థితుల్లో దాదాపు ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక 'క్రాక్' సినిమాతో సక్సెస్ అందుకొని ఫాంలోకి వచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా మైత్రీ మూవీస్ నిర్మించే సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జోరుగా సాగుతోంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అలాగే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ సినిమా ఒకటి చేయనున్నట్టు సమాచారం. 

Updated Date - 2021-05-04T13:49:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!