బన్నీ.. మారేడుమిల్లి వెళ్లేది ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2021-01-03T17:58:26+05:30 IST
అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ ను మారేడు మిల్లిలో స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. డిసెంబర్ నెలలో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో షూటింగ్ ఆపేసి వచ్చేశారు. కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ మళ్లీ 'పుష్ప' షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయారని సినీ వర్గాల సమాచారం. వివరాల మేరకు జనవరి 8 నుండి మళ్లీ అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్ మారేడుమిల్లికి వెళ్లబోతున్నారట. శేషాచల అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమాను చిత్రీకరిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ప్యాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా విడుదల కానుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.