సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హాలీవుడ్ టెక్నాలజీతో 'సలార్'..!

ABN, First Publish Date - 2021-09-25T16:38:25+05:30

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్'. ఈ మూవీని హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారట. 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్'. ఈ మూవీని హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందిస్తున్నారట. 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం దీని చిత్రీకరణ ముంబైలో శరవేగంగా సాగుతోంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకముందెన్నడు లేని విధంగా హై ఎండ్ హాలీవుడ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. హాలీవుడ్‌లో రూపొందిన 'మ్యాట్రిక్స్' 'బ్యాట్ మ్యాన్' లాంటి చిత్రాలకు ఉపయోగించిన టెక్నాలజీతో 'సలార్' చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారట. ఇదే నిజమైతే భారతీయ సినీ ప్రియులకు సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Updated Date - 2021-09-25T16:38:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!