సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sabhaku Namaskaram : వేరే సంస్థ టేకప్ చేస్తోందా?

ABN, First Publish Date - 2021-10-21T16:55:00+05:30

వరుస పరాజయాలతో పయనిస్తోన్న అల్లరి నరేశ్ కు ఈ ఏడాది ‘నాంది’ మూవీ బ్లాక్ బస్టర్ ఊరటనిచ్చింది. కామెడీని పక్కనపెట్టి, సీరియస్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరుకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇదే ఊపులో నరేశ్ మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ మెంట్ ఇచ్చారు. ఆ సినిమా ‘సభకు నమస్కారం’. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రమే ఈ సినిమా. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా బిజీ అవుతోన్న మహేశ్ కోనేరు నిర్మాణంలో సినిమా తెరకెక్కాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుస పరాజయాలతో పయనిస్తోన్న అల్లరి నరేశ్ కు ఈ ఏడాది ‘నాంది’ బ్లాక్‌బస్టర్  ఊరటనిచ్చింది.  కామెడీని పక్కనపెట్టి, సీరియస్ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరుకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇదే ఊపులో నరేశ్ మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీకి కమిట్ మెంట్ ఇచ్చారు. ఆ సినిమా ‘సభకు నమస్కారం’. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రమే ఈ సినిమా. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా బిజీ అవుతోన్న మహేశ్ కోనేరు నిర్మాణంలో సినిమా తెరకెక్కాలి. అయితే రీసెంట్ గా మహేశ్ కోనేరు దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించడంతో ఈ ప్రాజెక్ట్ చిక్కుల్లో పడింది. సినిమా ఆగి పోయిందని ప్రచారం కూడా జరిగింది. 



దాంతో అల్లరినరేశ్ రంగంలోకి దిగి.. ‘సభకు నమస్కారం’ సినిమాను తిరిగి లైన్ లో పెట్టారని వార్తలొస్తున్నాయి. తన సొంత ప్రొడక్షన్ గా నరేశ్ భావించే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుందని తెలుస్తోంది. అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేశారని సమాచారం. సతీశ్ మల్లంపాటి దర్శకత్వంలో ఆకుల శివ రచనా సహకారంతో ‘సభకు నమస్కారం’ త్వరలోనే ప్రారంభం కానున్నదని ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో రాజకీయ నాయకుడిగా అల్లరి నరేశ్ నటించబోతున్నారు. ఈ సినిమా కూడా నరేశ్ కు మంచి పేరు తెస్తుందేమో చూద్దాం.  

Updated Date - 2021-10-21T16:55:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!