సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఒక్క పాటకే 3కోట్ల బడ్జెట్..?

ABN, First Publish Date - 2021-07-14T23:12:19+05:30

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజ్కమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో ఒక్క పాటకే 3కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తాజాగా వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజ్కమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో ఒక్క పాటకే 3కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తాజాగా వార్తలు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ - మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఇందులో అలియా భట్‌, ఒలీవియా మోరీస్‌ వారికి జంటగా కనిపించబోతున్నారు. బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఆలియా భట్ మీద ఈ భారీ బడ్జెట్ పాటను చిత్రీకరించనున్నారట. కేవలం ఆమె కాస్ట్యూమ్స్‌ కోసం దాదాపు రూ.కోటి ఖర్చు చేస్తునట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీకి ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి బృందం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.  


Updated Date - 2021-07-14T23:12:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!