‘మోసగాళ్ళు’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2021-03-19T21:49:09+05:30 IST

మొదటనుంచి విష్ణు మంచు చెప్పినట్టుగానే, మోసగాళ్ళు రెగ్యులర్‌ ఫిల్మ్‌ కాదు..

‘మోసగాళ్ళు’ మూవీ రివ్యూ

చిత్రం: మోసగాళ్ళు

బ్యానర్‌: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ

నటీనటులు:  విష్ణు మంచు, కాజల్‌ అగర్వాల్‌, రూహీ సింగ్‌, సునీల్ శెట్టి, నవదీప్‌, నవీన్‌ చంద్ర తదితరులు

సినిమాటోగ్రఫీ: షెల్డన్‌ చౌ

మ్యూజిక్‌: శ్యామ్‌ సి.ఎస్‌

నిర్మాత:  విష్ణు మంచు

దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్‌మొదటనుంచి విష్ణు మంచు చెప్పినట్టుగానే, మోసగాళ్ళు రెగ్యులర్‌ ఫిల్మ్‌ కాదు. మాస్ ఎలిమెంట్స్ గురించో, అనవసరమైన కమర్సియల్‌ హంగామా గురించో తాపత్రయపడకుండా, చాలా నిజాయతీగా కథని కథగా మాత్రమే హేండిల్‌ చేసి, ఆడియన్స్‌కి ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని మంచు విష్ణు మిగిల్చాడని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కర్లేదు. రియల్‌గా జరిగిన కథనే తీసుకున్నప్పటికీ కూడా, విష్ణు జరిగిన కథను సినిమాగా మలిచిన విధం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడం ఇందులో విశేషం. కథా రచయితే తానే అయినా, కేవలం కథలో సంఘటలకు, సన్నివేశాలకు ప్రాముఖ్యతను కల్పిస్తూ, తాను సైతం కథానాయకుడిగా కాకుండా, కథలో పాత్రలలో ఒక పాత్రగా ఒదిగిపోవడం మోసగాళ్ళు సినిమాలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత. కథకుడిగానూ, మరోవైపు నటన పరంగా కూడా విష్ణు మంచు ఈ సినిమా ద్వారా తన ప్రతిభను చాటుకున్నాడు.


కథ:


కటిక పేదరికంలో పుట్టిన కవల పిల్లలు, చిన్ననాటి సంఘటనలకు ప్రభావితమై, డబ్బు సంపాదన కోసం లేటెస్ట్ ట్రెండ్‌ ప్రకారం స్కాములు చేసి మరీ కోట్లకు పడగలెత్తిన కథతో మోసగాళ్లు చిత్రం రూపొందింది. అర్జున్‌ (మంచు విష్ణు), అను (కాజల్‌ అగర్వాల్‌) కవలపిల్లలు. చాలీచాలని తండ్రి సంపాదనతో, దానికి తోడు అప్పుల ఊబిలో కూరుకుపోయి, సమస్యల సుడి గుండంలో చిక్కుకున్న కుటుంబం. తండ్రి నేర్పిన నీతినిజాయతీ పాఠాలను నమ్మినా, తండ్రే మోసాలకు గురయ్యాడనే ఆవేదనతో అను, అర్జున్‌ ఇద్దరూ పెద్దయ్యాక, తమ స్నేహితుడు‌ విజయ్‌(నవదీప్‌‌) సహాయంతో అమెరికన్లను టాక్స్‌ ఎరియర్స్ పేరుతో మోసం చేసి, చాలా స్పీడుగా రిచ్‌ అయిపోతారు. అయితే స్కాముల నుంచి సంపాదించిన కోట్లరూపాయలతో జీవితంలో ప్రశాంతంగా జీవితంలో స్థిరపడిపోయి, అడ్డదారులకు స్వస్తి చెప్పేద్దామని అను ఎంత చెప్పినా అర్జున్‌ పెడచెవిన పెడతాడు. ధనవంతుడైన గర్వంతో అక్క చెప్పిన మాటలు చెవికెక్కని అర్జున్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతాడు. ఈలోగా స్కాము ప్రారంభానికి ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన విజయ్‌తో కూడా అర్జున్‌కి వ్యవహారం చెడిపోతుంది. ఈలోగా, ఆఫీసులోనే అర్జున్‌ అక్రమాలకు అమెరికాలో కుటుంబాలు కకావికలమైపోవడాన్ని గమనించిన ఓ ఉద్యోగిని అమెరికన్ అథారిటీస్‌కి అర్జున్‌ అవినీతి గురించి వివరాలను అందజేస్తుంది. లోకల్‌ ఏసీపీ (సునీల్‌ శెట్టి) అమెరికన్‌ అథారిటీస్‌తో చేతులు కలిపి అర్జున్‌ని రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. అను మాత్రం తమ్ముడు అర్జున్‌ని అతి తక్కువ కాలంలోనే జైలు నుంచి విడిపించి, బయటకు తీసుకొచ్చేస్తుంది. కథ సుఖాంతమే.


విశ్లేషణ:


మోసగాళ్ళు సినిమా ప్రజెంట్‌ ట్రెండ్‌కి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌. ఆద్యంతం కొనసాగిన స్టయిల్‌, ఫ్యాషనబుల్‌ ప్రజెంటేషన్‌ థియేటర్‌లో ఆడియన్స్‌ని అరెస్ట్ చేశాయి. సినిమా స్టార్ట్ అయిన మొదటి ఫ్రేం నుంచి చివరివరకూ కొనసాగిన ఎగ్జైట్‌మెంట్‌ అండ్‌ టెంపో సినిమాకి తిరుగులేని ఫ్రెష్‌నెస్‌నిచ్చాయి. రాబోతున్న సీన్‌ ఏమిటో అంతు చిక్కకుండా రాసుకున్న ఇంట్రస్టింగ్‌ స్క్రీన్‌ప్లే కారణంగా ధియేటర్‌లో పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌ చివరిదాకా కొనసాగి, మోసగాళ్ళు ఎంతో ఉత్కంఠభరితంగా ప్రేక్షకులని అకట్టుకోవడంలో సెంట్ పర్స్ంట్‌ మార్కుల్ని స్కోర్‌ చేసిందనే చెప్పాలి. కథ ఎంత ఒరిజినల్‌గా జరిగినదే అయినా సరే, మంచు విష్లు సినిమా కథగా రాసుకున్న కంటెంట్‌ ఏదైతే ఉందో అది డొంక తిరుగుళ్లు లేకుండా చాలా సూటిగా, పదునుగా ఉండడం చేత సినిమా ఎక్కడా బోర్‌ అన్నది లేకుండా ఎంతో ఆసక్తికరంగా ముందుకు నడిచింది. దానికి తోడు కెమెరా పనితనం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌…రెండూ రెండు రకాలుగా ఆడియన్స్‌ని సీన్‌ టు సీన్‌ లాస్ట్‌ సీన్‌ వరకూ లాక్కెళ్ళిపోయాయి. నిజంగానే ఈ టైపాఫ్ టేకింగ్‌, యాంగిల్స్ తెలుగు సినిమా వరకూ కొత్తే అని చెప్పడం ఆతిశయోక్తి కానేకాదు. ప్రతీ సన్నివేశానికి ఓ స్పెషల్‌ రేంజ్‌ ఉంది. ప్రతీ షాటుకీ ఓ పర్సజ్‌, ప్రయోజనం ఉన్నాయి. ప్రతీది కథను ఆడియన్స్‌ దృష్టిలో రక్తి కట్టించడానికి, రాణింపజేయడానికి అదనుగా ఉపయోగపడ్డాయి. ఫస్టాఫ్‌లో కథ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, సెకండాఫ్‌ మాత్రం జెట్‌స్పీడులో క్లైమాక్స్‌ వైపుకి పరుగులు పెట్టింది సినిమా. సెకండాఫ్‌ కథను బాగా గేరప్‌ చేయడంతో, క్లైమాక్స్ ధ్రిల్లింగ్‌గా ఉంది. అదీ చాలా నేచురల్‌గా. టెక్నికల్‌గా మాట్లాడాలంటే ఫెంటాస్టిక్‌గా ఉంది.


నటీనటులు:


మోసగాళ్లు సినిమాకి రచయిత, హీరో మంచువిష్ణే అయినా, తన మాస్‌ ఇమేజ్‌ని పక్కనబెట్టి మరీ విష్టు కధలో తానూ ఒక పాత్రగా మారిపోవడంతో అది సినిమా ఫైనల్‌ ఇంపాక్ట్‌కి ఎంతగానో ఉపయోగపడింది. తన క్యారెక్టర్‌ని విష్టు చాలా ఇంటలిజెంట్‌గా హేండిల్‌ చేసి కొత్తగా కనిపించాడు. అర్జున్‌ పాత్రగా మాత్రమే కనిపించడానికి విష్ణు పెట్టిన ఎఫర్ట్ అర్జున్‌ పాత్రకే కాదు, టోటల్‌ సినిమాకే సూపర్ క్వాలిటీని తెచ్చిపెట్టింది. అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకుడు సైతం మంచువిష్ణుని కొత్తగా చూసే అవకాశం మోసగాళ్ళు చిత్రంలో దొరికింది. విష్ణు అక్కగా కాజల్‌ చేయడంతో ఆ క్యారెక్టర్‌కే కాదు ప్రత్యేకించి సినిమా రన్‌కే ఊహించని ఎడ్వాంటేజ్‌ అయింది. వాళ్ళమధ్య సీన్స్‌ చాలా టచ్చింగా అనిపించాయి. చేసిన ప్రతీ సినిమాలోనూ డాన్స్‌లు, పాటలతో అలసిపోయే కాజల్‌ ఇందులో అనూ పాత్రతో తనలోని యాక్టింగ్‌ మెరిట్‌కి తెరలేపినట్టయింది. ఏసిపి పాత్రను సునీల్‌శెట్టి పోషించడంతో ఆ క్యారెక్టరైజేషన్‌ రిచ్‌గానే కాకుండా, షార్ప్‌గా రూపొందడానికి సునీల్‌శెట్టి చాలా హెల్స్‌ అయ్యాడు. నవదీప్‌, నవీన్‌చంద్ర ఇద్దరూ సహకారపాత్రలుగా కథని సునాయాసంగా మోయగలిగారు.


ఫైనల్‌ కామెంట్‌:


కథకి ముందుగానూ, తర్వాత అక్కడక్కడ విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌తో ఎప్పటికప్పడు రన్నింగ్ కామెంట్రీ ఇప్పించినా, సినిమా పరుగుని అది రెట్టింపు చేయగలిగిందే తప్ప ఎక్కడా కథని అడ్డగించలేదు. బలహీనపరచేదు. కథను ఓ పక్కన విప్పిచెబుతూ కూడా ఉత్కంఠబరితంగా నడిపించగలిగారు. అదీ మోసగాళ్ళు ట్రీట్‌మెంట్‌లో స్పెషల్‌ మెరిట్‌. ప్రెష్‌నెస్‌ కోరుకునే ఆడియన్స్‌ తప్పక చూడాల్పిన సినిమా, చూసి ఎంజాయ్ చేసే సినిమా మోసగాళ్లు.

Updated Date - 2021-03-19T21:49:09+05:30 IST