సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘అఖండ’ చిత్రం చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందన ఇదే

ABN, First Publish Date - 2021-12-03T04:12:29+05:30

నందమూరి నటసింహం బాలయ్య, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తోంది. బాలయ్య అభిమానులే కాక తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్ర విజయంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి నటసింహం బాలయ్య, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తోంది. బాలయ్య అభిమానులే కాక తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఈ చిత్ర విజయంతో సంబరాలను జరుపుకుంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ట్విట్టర్ వేదికగా బాలయ్యకు, చిత్రయూనిట్‌‌‌కు అభినందనలు తెలియజేశారు.


‘‘ఇప్పుడే అఖండ చిత్రం చూశాను. ఈ చిత్రంతో రీసౌండింగ్ సక్సెస్ అందుకున్న బాల బాబాయ్‌కి, టీమ్ మొత్తానికి అభినందనలు. సినిమాలో ఎంజాయ్ చేయడానికి ఎన్నో ఫ్యాన్ మూమెంట్స్ ఉన్నాయి..’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2021-12-03T04:12:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!