‘తిమ్మరుసు’ ట్రైలర్ వదిలిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్
ABN, First Publish Date - 2021-07-26T23:18:06+05:30
సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి
సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మించిన చిత్రం ‘తిమ్మరుసు’. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్, ప్రమోషనల్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. జూలై 30న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.
‘ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుండి కారుకి వెళతారు.. రామ్ కారు నుండి బైక్‌కి వచ్చాడు’
‘గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి’
‘కోర్ట్‌కు కావాల్సింది షార్ట్ ఫిల్మ్స్, మాక్ డ్రిల్స్ కాదు.. బలమైన ఆధారాలు’
‘నువ్వు కొడితే సౌండ్ వస్తుందేమో.. ఈ లాయర్ కొడితే.. లైఫంతా రీ సౌండే’
‘నువ్వు సగం బలం లాక్కునే వాలివయితే.. నేను దండ వేసి దండించే రాముడిలాంటివాడిని’.. వంటి డైలాగ్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్‌ని సినిమాపై అంచనాలు పెంచే విధంగా కట్ చేశారు. హీరో సత్యదేవ్ లాయర్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.