‘యజ్ఞ’ మూవీ మొదలైంది
ABN , First Publish Date - 2021-12-29T03:18:23+05:30 IST
పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో.. మురళీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పొందూరి రామ్మోహన్ రావు నిర్మిస్తోన్న చిత్రం ‘యజ్ఞ’. సుగమ్య శంకర్, నందిని, రాఘవ, చరణ్ జడ్చర్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి

పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో.. మురళీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై పొందూరి రామ్మోహన్ రావు నిర్మిస్తోన్న చిత్రం ‘యజ్ఞ’. సుగమ్య శంకర్, నందిని, రాఘవ, చరణ్ జడ్చర్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. భానుచందర్, జీవా, బాలాజీ, గౌతంరాజు, సుమన్ శెట్టి, పొట్టి చిట్టిబాబు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టియఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ క్లాప్ నివ్వగా.. లయన్ సాయి వెంకట్ కెమెరా స్విచాన్ చేశారు. గూడూరు చెన్నారెడ్డి, విజయలక్ష్మి, మారంరెడ్డి కొండా రెడ్డి, కొండపాక శ్రీరామమూర్తి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకనిర్మాతలిద్దరూ నాకు చాలా కావాల్సినవారు. సినిమా పట్ల ఎంతో అభిరుచి ఉన్న వ్యక్తులు. కథ విన్నాను. చాలా బాగుంది. సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి అవ్వాలని కోరుకుంటూ.. సినిమా విడుదల విషయంలో ఎటువంటి సాయమైనా చేయడానికి సిద్ధం’’ అని తెలుపగా లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్ చాలా బాగుంది. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు ప్రసాద్‌గారు. కొత్త, పాత నటీనటులతో రూపొందుతోన్న ఈ చిత్రం.. యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని అన్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘హారర్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్త, పాత నటీనటులు నటిస్తున్నారు. నేటి నుండి రెండు రోజుల పాటు షూటింగ్ చేస్తాం. కొంత గ్యాప్ తర్వాత జనవరి 5 నుంచి 15 రోజుల పాటు కంటిన్యూగా షెడ్యూల్ ప్లాన్ చేశాం. మా చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించిన అతిథులందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు.