ఎక్స్వైజడ్తో హిట్ కొడతాం
ABN , First Publish Date - 2021-09-26T06:53:31+05:30 IST
రొమాంటిక్ క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఎక్స్వైజడ్’. ఆక్షి, మధు, సంజయ్, ప్రదీప్ ముఖ్య తారాగణం. మెట్రో స్టూడియోస్ అధినేత ఇ.వి.ఎన్. చారి దర్శకత్వంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నిర్మిస్తున్నారు....
రొమాంటిక్ క్రైమ్, యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఎక్స్వైజడ్’. ఆక్షి, మధు, సంజయ్, ప్రదీప్ ముఖ్య తారాగణం. మెట్రో స్టూడియోస్ అధినేత ఇ.వి.ఎన్. చారి దర్శకత్వంలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నిర్మిస్తున్నారు. ఇటీవలె విశాఖలో జరిగిన షెడ్యూల్తో షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించడంలో మా నిర్మాత సహకారం మరువలేనిది’ అని ధన్యవాదాలు తెలిపారు. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ ‘‘నటీనటులు కొత్తవాళ్లు అయినా ఎంతో అనుభవమున్నవారిలా నటించారు. అనుకున్న దానికన్నా సినిమా బాగా వచ్చింది. సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. మా దర్శకుడు ప్రణాళిక ప్రకారం షూటింగ్ పూర్తి చేశారు’’ అని ప్రశంసించారు.