లాస్‌ వేగాస్‌లో పని పూర్తయ్యింది

ABN , First Publish Date - 2021-11-29T11:15:28+05:30 IST

స్పోర్ట్స్‌ డ్రామా కథల వైపు టాలీవుడ్‌ మరింత ఆసక్తి చూపిస్తోంది. క్రీడా నేపథ్యం ఉన్న కథల్లో నటించడానికి హీరోలు మొగ్గు చూపిస్తున్నారు...

లాస్‌ వేగాస్‌లో పని పూర్తయ్యింది

స్పోర్ట్స్‌ డ్రామా కథల వైపు టాలీవుడ్‌ మరింత ఆసక్తి చూపిస్తోంది. క్రీడా నేపథ్యం ఉన్న కథల్లో నటించడానికి హీరోలు మొగ్గు చూపిస్తున్నారు. ఈ జాబితాలో విజయ్‌ దేవరకొండ కూడా చేరారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌దేవరకొండ నటిస్తున్న ‘లైగర్‌’ స్పోర్ట్స్‌ డ్రామానే. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. అనన్య పాండే కథానాయిక. ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మాతలు. విజయ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇది. ఇటీవల చిత్రబృందం లాస్‌ వేగాస్‌ వెళ్లింది. ఆదివారంతో వేగాస్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. త్వరలోనే  టీమ్‌ అంతా ఇండియా తిరిగొస్తుంది. ఇక్కడ మరో దఫా చిత్రీకరణ మొదలెడతారు. ప్రపంచ ప్రఖ్యాత ఆటగాడు మైక్‌ టేసన్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-11-29T11:15:28+05:30 IST