టాలెంట్‌ లేకపోతే... ఇండస్ట్రీ ఎత్తుకోదు

ABN , First Publish Date - 2021-11-01T06:41:05+05:30 IST

‘‘నేను ఓటీటీకి యజమానిని. అయినా సరే... ఏ సినిమా అయినా థియేటర్లలోనే చూడాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడే చిత్రసీమకు మంచి రోజులు వచ్చినట్టు...

టాలెంట్‌ లేకపోతే... ఇండస్ట్రీ ఎత్తుకోదు

‘‘నేను ఓటీటీకి యజమానిని. అయినా సరే... ఏ సినిమా అయినా థియేటర్లలోనే చూడాలని కోరుకుంటాను. ఎందుకంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడే చిత్రసీమకు మంచి రోజులు వచ్చినట్టు’’ అన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘ మంచి రోజులు వచ్చాయి’. ఈనెల 4న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘సంతోష్‌ శోభన్‌ ప్రతిభ నాకు తెలుసు. ఎంత బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నా సరే, ప్రతిభ లేకపోతే పరిశ్రమ ఎత్తుకోదు. తన ప్రతిభే అవకాశాలు వచ్చేలా చేస్తోంద’’న్నారు. మారుతి మాట్లాడుతూ ‘‘కరోనా తరవాత అందరూ ఒకరకమైన భయంలోకి వెళ్లిపోయారు. దాని చుట్టూ నవ్వించే సినిమా ఎందుకు తీయకూడదు? అనే ఆలోచన నుంచి ఈ సినిమా పుట్టింద’’న్నారు. 


Updated Date - 2021-11-01T06:41:05+05:30 IST