సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సరికొత్త పాయింట్‌తో

ABN, First Publish Date - 2021-07-23T10:35:15+05:30

రాజ్‌ సూర్యన్‌, నివిక్షా నాయుడు నాయకా నాయికలుగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బిహైండ్‌ సమ్‌వన్‌’. ఇటీవలె గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్‌ సూర్యన్‌, నివిక్షా నాయుడు నాయకా నాయికలుగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బిహైండ్‌ సమ్‌వన్‌’. ఇటీవలె గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమన్‌ కీలకపాత్రలో నటించారు. చిత్ర దర్శకుడు అజయ్‌ నాలి మాట్లాడుతూ‘‘సరికొత్త పాయింట్‌తో రాసుకున్న కథ ఇది. బడ్జెట్‌ విషయంలో వెనకాడకుండా సినిమా అద్భుతంగా తెరకెక్కించాం. ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది’’ అని అన్నారు. నిర్మాత సింగవరం సునీల్‌కుమార్‌ సింగ్‌ మాట్లాడుతూ‘‘యువతకు నచ్చే వాణిజ్యహంగులు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. వీలయినంత త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చెప్పారు. అజయ్‌, రవిబాబు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ కూరాకుల సంగీతం అందిస్తున్నారు. 


Updated Date - 2021-07-23T10:35:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!