క్రిమినల్‌గా ఎందుకు మారాడు?

ABN , First Publish Date - 2021-11-16T05:49:52+05:30 IST

గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘నయీం డైరీస్‌’. వశిష్ట సింహా కథానాయకుడు. దాము బాలాజీ దర్శకత్వం వహించారు. సీఏ వరదరాజు నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ని...

క్రిమినల్‌గా ఎందుకు మారాడు?

గ్యాంగ్‌ స్టర్‌ నయీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘నయీం డైరీస్‌’. వశిష్ట సింహా కథానాయకుడు. దాము బాలాజీ దర్శకత్వం వహించారు. సీఏ వరదరాజు నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఫిక్షన్‌ కథలకంటే, నిజ జీవిత కథలతో సినిమాలు తీస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ట్రైలర్‌ చాలా బాగుంద’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఐదేళ్ల క్రితం నయీం ఎన్‌కౌంటర్‌ జరిగింది. అదో సంచలనం. దానిపై నేను అధ్యయనం చేశాను. నయీం ఎందుకు క్రిమినల్‌ గా మారాడు? తన వెనుక ఎవరున్నారు? నయీంని మించిన నేరస్థులు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారు? అనే విషయాల్ని లోతుగా ఈ సినిమాలో చూపిస్తున్నామ’’న్నారు. 


Updated Date - 2021-11-16T05:49:52+05:30 IST