కీర్తి సురేశ్ తొలి సంపాదన ఎంతంటే..!
ABN, First Publish Date - 2021-05-04T19:13:36+05:30
కీర్తి సురేష్ మొదటి సంపాదన గురించి ఇప్పుడు నెటిజన్స్‌లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన కీర్తి సురేష్ కొన్ని సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టు..పైగా ఆరోజుల్లో అంటే కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో అని అందరికీ ఆసక్తి ఉండటం సహజం.
కీర్తి సురేష్ మొదటి సంపాదన గురించి ఇప్పుడు నెటిజన్స్‌లో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన కీర్తి సురేష్ కొన్ని సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టు..పైగా ఆరోజుల్లో అంటే కీర్తి సురేశ్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుందో అని అందరికీ ఆసక్తి ఉండటం సహజం. అందుకు కారణం కీర్తి సురేష్ తల్లి మేనక హీరోయిన్‌గా హిట్ సినిమాలు చేసింది. ఒక హీరోయిన్ కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ అంటే బాగానే రెమ్యునరేషన్ ఇస్తారని అందరు అనుకోవడం సహజం. కానీ కీర్తి మొదటి సంపాదనగా అందుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ. 500 మాత్రమేనట. స్వయంగా ఈ విషయాన్ని కీర్తి సురేష్ ఇటీవల వెల్లడించింది. కీర్తి సురేశ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించినప్పుడు.. నిర్మాతలు తనకు డబ్బును కవర్‌లో పెట్టి ఇచ్చేవారట. అయితే ఆ కవర్ ఓపెన్ చేయకుండా తీసుకు వెళ్ళి తన తండ్రికి ఇచ్చేదట కీర్తి. ఆ కవర్‌లో ఎంత డబ్బు ఉండేదో కూడా కీర్తికి తెలిసేది కాదట. కానీ కాలేజీలో ఒకసారి ఫ్యాషన్ డిజైనింగ్ చేసినందుకు రూ. 500 ఇచ్చారట. కీర్తికి ఊహ తెలిసిన తర్వాత అందుకున్న మొదటి సంపాదన రూ. 500 అని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా వెలుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట', 'సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాత్తే' సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. 'గుడ్ లక్ సఖీ' రిలీజ్ కావాల్సి ఉంది. ఇప్పుడు తను అందుకునే రెమ్యునరేషన్ ఎంతుంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.