ఇలాంటి తోడు ఉంటే చాలు : కీర్తి సురేష్

ABN , First Publish Date - 2021-06-20T16:56:10+05:30 IST

ఇలాంటి తోడు ఉంటే చాలు అంటూ ఇంకేం కావాలి అంటున్నారు మహానటి కీర్తి సురేష్. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్న ఈమె, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్, తన సినిమా అప్‌డేట్స్ అలాగే తన క్లోజ్ ఫ్రెండ్స్, సినిమా టీంతోనూ ఉత్సాహంగా గడిపిన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటారు.

ఇలాంటి తోడు ఉంటే చాలు : కీర్తి సురేష్

ఇలాంటి తోడు ఉంటే చాలు అంటూ ఇంకేం కావాలి అంటున్నారు మహానటి కీర్తి సురేష్. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటున్న ఈమె, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్, తన సినిమా అప్‌డేట్స్ అలాగే తన క్లోజ్ ఫ్రెండ్స్, సినిమా టీంతోనూ ఉత్సాహంగా గడిపిన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో తాజాగా..వరల్డ్‌ పిక్‌ నిక్‌ డేకి నాకు సరైన తోడు దొరికిందంటూ పిక్‌నిక్‌ వెళ్లిన ఫొటోలను పోస్ట్ చేశారు కీర్తి సురేష్. ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో .. "సరైన తోడు, ఆహ్లాదకరమైన వాతావరణం…అందులోనూ బీచ్‌ ఒడ్డున హాయిగా సాగిపోయే పిక్‌ నిక్‌. ఇంతకంటే ఇంకేం కావాలి" అని తన పెంపుడు కుక్క నైక్‌తో మెసేజ్‌తో కూడిన ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కీర్తి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్‌ బాబుతో 'సర్కారు వారి పాట', రజనీకాంత్ నటిస్తున్న 'అణ్ణాత్త'లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే 'గుడ్ లక్ సఖీ' రిలీజ్‌కి రెడీ అవుతోంది. 



Updated Date - 2021-06-20T16:56:10+05:30 IST