వైవిధ్యమున్న సినిమాలు తీస్తాం

ABN , First Publish Date - 2021-11-29T11:10:18+05:30 IST

‘‘అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా నా వృత్తిని కొనసాగిస్తూనే పంపిణీదారుగా, చిత్ర నిర్మాతగా నిలదొక్కుకున్నాను. ఇప్పుడు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ ప్రారంభించాను...

వైవిధ్యమున్న సినిమాలు తీస్తాం

‘‘అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా నా వృత్తిని కొనసాగిస్తూనే పంపిణీదారుగా, చిత్ర నిర్మాతగా నిలదొక్కుకున్నాను. ఇప్పుడు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ ప్రారంభించాను. ప్రస్తుతం ఎనిమిది సినిమాలు నిర్మిస్తున్నాను’’ అన్నారు నిర్మాత సృజన్‌ యరబోలు. తేజ సజ్జా, శివానీ రాజశేఖర్‌ జంటగా నటించిన ‘అద్భుతం’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ సినిమా నిర్మాతల్లో సృజన్‌ ఒకరు. ఈ సందర్భంగా తను నిర్మిస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ ‘‘పంపిణీదారుగా తొలిసారి ఓవర్సీ్‌సలో ‘కంచె’ చిత్రాన్ని రిలీజ్‌ చేశాను. తర్వాత ‘అర్జున్‌రెడ్డి’, ‘మహానటి’ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి పలు చిత్రాలను ఓవర్సీ్‌సలో డిస్ట్రిబ్యూట్‌ చేశాను. ప్రస్తుతం ‘స్కైలాబ్‌’ చిత్రాన్ని ఓవర్సీ్‌సలో పంపిణీ చేస్తున్నాను. కరోనాతో డల్‌ అయిన ఓవర్‌సీస్‌ మార్కెట్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. పెద్ద సినిమాలు రిలీజయితే మరింత మెరుగుపడుతుంది. ‘పంచతంత్రం’ సినిమాను త్వరలో విడుదల చేస్తాం. సంతోష్‌ శోభన్‌తో ఒక చిత్రం, బ్రహ్మనందం గారి తనయుడు గౌతమ్‌తో మరో చిత్రం చేస్తున్నాం. నాకు కాన్సెప్ట్‌ బేస్‌డ్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం. నేను తీసే సినిమాలు కూడా చాలావరకూ కాన్సెప్ట్‌ బేస్‌ చేసుకొనే ఉంటాయి. ఇకపై మా బేనర్‌లో వరుసగా సినిమాలు చేస్తాం. వైవిధ్యభరిత చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనేది మా ప్రయత్నం’’ అన్నారు. 


Updated Date - 2021-11-29T11:10:18+05:30 IST