భయపెడుతూ నవ్విస్తాం

ABN , First Publish Date - 2021-12-29T05:41:13+05:30 IST

సుగమ్య శంకర్‌, నందిని, రాఘవ, చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకుడు. పొందూరి రామ్మోహనరావు నిర్మాత....

భయపెడుతూ నవ్విస్తాం

సుగమ్య శంకర్‌, నందిని, రాఘవ, చరణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకుడు. పొందూరి రామ్మోహనరావు నిర్మాత. మంగళవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్‌ క్లాప్‌నిచ్చారు. లయన్‌ సాయివెంకట్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘హారర్‌, కామెడీ నేపథ్యంలో సాగే కథ ఇది. భయపెడుతూనే నవ్విస్తాం. గురువారం వరకూ హైదరాబాద్‌లోనే షూటింగ్‌ జరుపుతాం. జనవరి 5 నుంచి కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంద’’న్నారు. ‘‘కథ నచ్చి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడడం లేద’’ని నిర్మాత తెలిపారు. భానుచందర్‌, జీవా, బాలాజీ, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవెందర్‌.

Updated Date - 2021-12-29T05:41:13+05:30 IST