సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘వియ్ ఫర్ ఇండియా’: స్టీవెన్ స్పీల్‌బర్గ్, చిరంజీవి పేర్లు వైరల్

ABN, First Publish Date - 2021-08-18T00:54:05+05:30

క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని స్థాపించి సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాను చేప‌ట్టి ప్రాణదాత అయ్యారు. అయితే ఈ సేవ‌ల‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని స్థాపించి సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాను చేప‌ట్టి ప్రాణదాత అయ్యారు. అయితే ఈ సేవ‌ల‌కు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కుతోంది. రిల‌యన్స్ సంస్థ ద్వారా జాతీయ అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు ‘వియ్ ఫర్ ఇండియా’ సంస్థ ద్వారా చారిటీ కార్య‌క్ర‌మం చేసి భార‌త‌దేశంలో కోవిడ్‌కి సంబంధించిన ఫండ్‌ని రైజ్ చేయాల‌ని ఆగ‌స్టు 15న ఓ ప్ర‌య‌త్నం చేయ‌గా.. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. 5 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల నిధిని సేక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ పోర్ట‌ల్ డెడ్ లైన్ డాట్ కాంలో ప్ర‌ముఖంగా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. కోవిడ్ స‌మ‌యంలో తాము చేసిన సేవ‌ల‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్య‌మాల లైవ్ వేదిక‌గా చిరు డెమో ఇచ్చారు. ఇలా చేసిన ప్ర‌ముఖుల్లో హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ స‌హా మెగాస్టార్ చిరంజీవి పేరు వైర‌ల్ అయ్యింది.


ఆగ‌స్టు 15 రాత్రి గ్లోబల్ ఫండ్ రైజర్ ‘వియ్ ఫర్ ఇండియా’ భారతదేశంలో కోవిడ్ బాధితుల సేవ‌కోసం నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం చేసింది. ఇది వర్చువల్ ఈవెంట్. వినాశకరమైన వైరస్ పై దేశ పోరాటానికి సహాయపడటానికి 5 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌ను సమీకరించి గొప్ప విజ‌యం సాధించామ‌ని ఫండ్ రైజ‌ర్ సంస్థ ప్ర‌క‌టించింది. దీనికోసం పాపుల‌ర్ స్టార్లు ముందుకు రావ‌డం విశేషంగా ఆ సంస్థ కొనియాడింది. స్టీవెన్ స్పీల్‌బర్గ్, చిరంజీవి, హృతిక్ రోషన్, అజయ్ దేవగన్, నాగార్జున, అనన్య పాండే వంటి వారంతా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. 

Updated Date - 2021-08-18T00:54:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!