వైజాగ్‌లో ఓపెన్ అయిన థియేటర్.. తొలి సినిమా ఏదో తెలుసా?

ABN , First Publish Date - 2021-06-13T20:27:49+05:30 IST

కొవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉండ‌టంతో సినిమా థియేట‌ర్స్‌ను డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ సెకండ్ థాట్ లేకుండా మూసేశారు. అయితే ఇప్పుడు వైజాగ్‌లోని జ‌గ‌దాంబ థియేట్ ‘క్రాక్’ సినిమాతో ప్రారంభ‌మైంది.

వైజాగ్‌లో ఓపెన్ అయిన థియేటర్.. తొలి సినిమా ఏదో తెలుసా?

కొవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉండ‌టంతో సినిమా థియేట‌ర్స్‌ను డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ సెకండ్ థాట్ లేకుండా మూసేశారు. అయితే ఇప్పుడు వైజాగ్‌లోని జ‌గ‌దాంబ థియేట్ ‘క్రాక్’ సినిమాతో ప్రారంభ‌మైంది. వివ‌రాల్లోకెళ్తే.. కరోనా వైర‌స్ సెకండ్ వేవ్ ప్ర‌భావం అన్ని రంగాల‌పై పెద్ద ప్ర‌భావాన్నే చూపించింది. సినీ రంగం విష‌యానికి వ‌స్తే షూటింగ్స్ ఆగిపోయాయి. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. అయితే ఇప్పుడు క‌రోనా కేసులు నెమ్మ‌దిగా త‌గ్గుతున్నాయి. ప్ర‌భుత్వం కూడా స‌డ‌లింపుల‌తో లాక్‌డౌన్‌ను కొన‌సాగిస్తోంది. ఈ క్ర‌మంలో సినిమా థియేట‌ర్స్‌ను తెర‌వాలా? వ‌ద్దా? అని డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. అయితే వైజాగ్‌లోని జ‌గ‌దాంబ థియేట‌ర్ య‌జ‌మాని ధైర్యం చేసి ముంద‌డుగు వేశారు. యాబై శాతం ఆక్యుపెన్సీతో జ‌గ‌దాంబ థియేట‌ర్‌ను ఆదివారం ఓపెన్ చేశారు. ఈ ఏడాది విడుద‌లైన బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో ర‌వితేజ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందిన క్రాక్ మూవీతో ఈ థియేట‌ర్ ఓపెన్ కావ‌డం విశేషం. 

Updated Date - 2021-06-13T20:27:49+05:30 IST