27న ఓటీటీలో 'వివాహ భోజనంబు'

ABN , First Publish Date - 2021-08-20T13:40:31+05:30 IST

హాస్య నటుడు సత్య హీరోగా నటించిన చిత్రం 'వివాహ భోజనంబు'. దీనిని 27న ఓటీటీలో విడుదల చేయనున్నారు. అర్జావీ రాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

27న ఓటీటీలో 'వివాహ భోజనంబు'

హాస్య నటుడు సత్య హీరోగా నటించిన చిత్రం 'వివాహ భోజనంబు'. దీనిని 27న ఓటీటీలో విడుదల చేయనున్నారు. అర్జావీ రాజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్ - సోల్జర్స్ ఫ్యాక్టరీ - వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్ - సందీప్ కిషన్ నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకి సిద్దంగా ఉన్న 'వివాహ భోజనంబు' ఈ నెల 27నుంచి సోనీ ఎలైవి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుదర్శన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్‌ తదితరులు ఇందులో కనిపించబోతున్నారు. 

Updated Date - 2021-08-20T13:40:31+05:30 IST