'పాగ‌ల్'‌గా విష్వ‌క్ సేన్.. రిలీజ్ ఫిక్స్‌

ABN , First Publish Date - 2021-02-02T16:10:38+05:30 IST

విష్వ‌క్ సేన్‌... 'ఫ‌ల‌క్‌నుమాదాస్‌, హిట్' చిత్రాల‌తో త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో. ఈ యువ క‌థానాయ‌కుడు, ఇప్పుడు చేస్తున్న సినిమా 'పాగ‌ల్'‌.

'పాగ‌ల్'‌గా విష్వ‌క్ సేన్.. రిలీజ్ ఫిక్స్‌

విష్వ‌క్ సేన్‌... 'ఫ‌ల‌క్‌నుమాదాస్‌, హిట్' చిత్రాల‌తో త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో. ఈ యువ క‌థానాయ‌కుడు, ఇప్పుడు చేస్తున్న సినిమా 'పాగ‌ల్'‌. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్‌తో పాటు సినిమాను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు. ర‌ధ‌న్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌రేశ్ కుప్పిలి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 



Updated Date - 2021-02-02T16:10:38+05:30 IST