ప్రేక్షకులకు విష్వక్సేన్ విన్నపం

ABN , First Publish Date - 2021-08-14T04:20:49+05:30 IST

మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్నలోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి.. ఉన్నా లేకపోయినా.. ఎన్నో వేలమందికి ఉపాధి కలిగించే..

ప్రేక్షకులకు విష్వక్సేన్ విన్నపం

విష్వక్సేన్ హీరోగా దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘పాగ‌ల్‌’. నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం ఆగ‌స్ట్ 14న విడుద‌ల‌కాబోతోన్న సందర్భంగా హీరో విష్వక్సేన్ ప్రేక్షకులకు ఓ విన్నపాన్ని తెలియజేశారు. 


ప్రియమైన ప్రేక్షకులకు

‘‘నేను మీ విశ్వక్‌సేన్. 

నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. ‘పాగల్’ సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నాను. 

మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్నలోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి.. ఉన్నా లేకపోయినా.. ఎన్నో వేలమందికి ఉపాధి కలిగించే.. సినిమా థియేటర్స్‌ను కాపాడండి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..’’ అని విష్వక్సేన్ ఓ లెటర్‌ను విడుదల చేశారు.



Updated Date - 2021-08-14T04:20:49+05:30 IST