నలుగురు హీరోయిన్లతో విశ్వక్ సేన్

ABN , First Publish Date - 2021-06-04T16:24:39+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. 'అక్టోబర్ 31 - లేడీస్ నైట్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రం హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా రాబోతుంది. 'తలైవి' ఫేమ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా ఇందులో విశ్వక్ సరసన ఏకంగా నలుగురు కుర్రహీరోయిన్స్ నటిస్తున్నారు.

నలుగురు హీరోయిన్లతో విశ్వక్ సేన్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. 'అక్టోబర్ 31 - లేడీస్ నైట్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రం హారర్ నేపథ్యంలో ఫస్ట్ హలోవీన్ మూవీగా రాబోతుంది. 'తలైవి' ఫేమ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా ఇందులో విశ్వక్ సరసన ఏకంగా నలుగురు కుర్రహీరోయిన్స్ నటిస్తున్నారు. మేఘాఆకాష్, మంజిమమోహన్, రెబ్బా మౌనిక జాన్, నివేదా పేతురాజ్ నటిస్తున్న ఈ సినిమాను త్రిపుర ఫేమ్ ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తయినట్టు సమాచారం. ఇక విశ్వక్ సేన్ ఫస్ట్ తమిళ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈయన నరేష్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో 'పాగల్' సినిమా చేస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కి రెడీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం, విశ్వక్ 'కప్పేలా' అనే మలయాళం రీమేక్ తో పాటు 'ఓ మై కడవులే' అనే తమిళ మూవీ రీమేక్ కూడా చేస్తున్నాడట. 

Updated Date - 2021-06-04T16:24:39+05:30 IST