విష్ణు మంచుకు జోడీగా...

ABN , First Publish Date - 2021-06-17T10:28:14+05:30 IST

‘జాతి రత్నాలు’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఇప్పుడు విష్ణు మంచుకు జోడీగా నటించే అవకాశం...

విష్ణు మంచుకు జోడీగా...

‘జాతి రత్నాలు’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఇప్పుడు విష్ణు మంచుకు జోడీగా నటించే అవకాశం ఆమెను వరించిందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల కథనం. ప్రస్తుతం ఫరియాతో చిత్రబృందం చర్చలు జరుపుతోందట. అవి ఓ కొలిక్కి వచ్చాయని, త్వరలో అధికారికంగా వివరాల్ని ప్రకటిస్తారని తెలిసింది. విష్ణు మంచు కథానాయకుడిగా, నిర్మాతగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డి అండ్‌ డి’. డబుల్‌ డోస్‌... అనేది ఉపశీర్షిక. విష్ణు, వైట్ల కలయికలో వచ్చిన ‘ఢీ’కి సీక్వెల్‌ ఇది. పోలీస్‌ డ్రామా కథతో సినిమా తీస్తున్నారని సమాచారం. ఇందులో పాత్ర కోసం విష్ణు జిమ్‌లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈపాటికి ప్రారంభం కావాలి. కరోనా రెండో దశ వల్ల ఆలస్యమైంది. త్వరలో సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.


Updated Date - 2021-06-17T10:28:14+05:30 IST