యదార్థ సంఘటనతో విరుమాండి కొత్త చిత్రం

ABN , First Publish Date - 2021-01-20T18:48:55+05:30 IST

యదార్థ సంఘటనలతో చిత్రాలు నిర్మించే వారిలో దర్శకుడు విరుమాండి ముందువరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన

యదార్థ సంఘటనతో విరుమాండి కొత్త చిత్రం

చెన్నై: యదార్థ సంఘటనలతో చిత్రాలు నిర్మించే వారిలో దర్శకుడు విరుమాండి ముందువరుసలో ఉంటారని చెప్పొచ్చు. ఇప్పటికే ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘క.పె.రణసింగం’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుని సినీ ప్రముఖుల ప్రశంసలు పొందుకుంటోంది. ఇపుడు మరో యధార్థ సంఘటనలో దర్శకుడు విరుమాండి మరో చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ చేయగా, అందులో శశికుమార్‌ హీరోగా నటించనున్నారు. 1975లో జరిగిన ఓ ఘటనను ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్రారంభించి, 2021 ఆఖరులో రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపారు. భరతన్‌ ఫిలిమ్స్‌ పతాకంపై ఆర్‌.విశ్వనాథన్‌ నిర్మించే ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం, వైరముత్తు గేయ రచన చేయనున్నారు. నటినటుల ఎంపికతో పాటు మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు.

Updated Date - 2021-01-20T18:48:55+05:30 IST