సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Virata parvam: 'వాయిస్ ఆఫ్ రవన్న'..టీజర్ రిలీజ్

ABN, First Publish Date - 2021-12-14T17:27:55+05:30

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'విరాట పర్వం'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'విరాట పర్వం'. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియమణి మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ - సినిమా టీజర్ - ఫస్ట్ సింగిల్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ క్రమంలోనే నేడు (డిసెంబర్ 14) రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా 'విరాట పర్వం' నుంచి ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ అనే పేరుతో ఓ స్పెషల్ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. త్వరలో 'విరాట పర్వం' రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.   



Updated Date - 2021-12-14T17:27:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!