చిరంజీవి చేతుల మీదుగా...
ABN , First Publish Date - 2021-03-20T04:32:31+05:30 IST
‘‘భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. ఆ కవిత్వానికి ఫిదా అవుతుంది కథానాయిక. ప్రేమ కోసం అన్నీ వదిలేసి అతని దగ్గరకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆమెను చుట్టుముట్టిన....
‘‘భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. ఆ కవిత్వానికి ఫిదా అవుతుంది కథానాయిక. ప్రేమ కోసం అన్నీ వదిలేసి అతని దగ్గరకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆమెను చుట్టుముట్టిన సమస్య ఏంటి? అన్నది తెలుసుకోవాలంటే ‘విరాటపర్వం’ చూడాల్సిందే’’ అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవి ట్రైలర్‌ను విడుదల చేశారు. రానా సంభాషణలు, సురేశ్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నవీన్ చంద్ర, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేశ్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది.