కొవిడ్‌ రూల్స్‌ అతిక్రమించారని...

ABN , First Publish Date - 2021-06-04T06:51:53+05:30 IST

కొవిడ్‌-19 నిబంధనలు అతిక్రమించారని, సరైన కారణం లేకుండా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రహదారులపైకి వచ్చారని హీరో టైగర్‌ ష్రాఫ్‌, హీరోయిన్‌ దిశా పటానీపై...

కొవిడ్‌ రూల్స్‌ అతిక్రమించారని...

కొవిడ్‌-19 నిబంధనలు అతిక్రమించారని, సరైన కారణం లేకుండా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రహదారులపైకి వచ్చారని  హీరో టైగర్‌ ష్రాఫ్‌, హీరోయిన్‌ దిశా పటానీపై ముంబై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ‘‘కరోనా వైర్‌సపై యుద్ధంలో భాగంగా బాంద్రా వీధుల్లో అలక్ష్యంగా తిరుగుతున్న ఇద్దరు యాక్టర్లపై 188, 34 ఐపీసీ సెక్షన్ల కేసు నమోదు చేశాం. ముంబై వాసులకు అనవసరమైన హీరోయిజం  చూపించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ముంబై పోలీసులు గురువారం ఉదయం అధికారిక ఖాతాలో ట్వీట్‌ చేశారు. అందులో టైగర్‌, దిశా నటించిన సినిమా పేర్లు ఉపయోగించడం గమనార్హం. ఈ కేసుపై హీరో హీరోయిన్లు పెదవి విప్పలేదు. మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ తల్లి ఆయేషా మాత్రం ‘‘వాళ్లిద్దరూ ఇంటికి వస్తున్న సమయంలో పోలీసులు ఆధార్‌ కార్డులు చెక్‌ చేశారు. ఇటువంటి సమయంలో సరదాగా తిరగాలని ఎవరూ కోరుకోరు. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది’’ అని కామెంట్‌ చేశారు. బహుశా... ఆవిడ ముంబై పోలీసుల ట్వీట్‌ చూడలేదేమో!


Updated Date - 2021-06-04T06:51:53+05:30 IST