సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘విక్రమ్‌ రాథోడ్‌’ అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుంది

ABN, First Publish Date - 2021-12-16T15:58:09+05:30

తాను నటించిన విక్రమ్‌ రాథోడ్‌ చిత్రం అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటుందని ప్రముఖ హీరో విజయ్‌ ఆంటోని అన్నారు. తిరుపతి సమీపంలోని తాజ్‌ హోటల్‌లో బుధవారం విక్రమ్‌ రాథోడ్‌ చిత్రం టీజర్‌తో పాటు, ఆడియో ఆవిష్కరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - ఆడియో ఆవిష్కరణలో హీరో విజయ్‌ ఆంటోని 


తిరుచానూరు(చెన్నై): తాను నటించిన విక్రమ్‌ రాథోడ్‌ చిత్రం అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటుందని ప్రముఖ హీరో విజయ్‌ ఆంటోని అన్నారు. తిరుపతి సమీపంలోని తాజ్‌ హోటల్‌లో బుధవారం విక్రమ్‌ రాథోడ్‌ చిత్రం టీజర్‌తో పాటు, ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిపి అన్ని హుంగులతో ఈ చిత్రాన్ని పెప్సీ శివ నిర్మించారన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని రావూరి వెంకటస్వామి విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను నటించిన బిచ్చగాడు, సలీం చిత్రాలకు సీక్వెల్స్‌ రానున్నాయని తెలిపారు.విక్రమ్‌ రాథోడ్‌ చిత్రం ఈ నెలాఖరులో విడుదలవుతుందన్నారు. ఇళయరాజా అందించిన మంచి సంగీతంతో పాటు ఎమోషన్స్‌, ఫైట్లు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని హీరోయిన్‌ రమ్యానంబీసన్‌, నిర్మాత పెప్సీ శివ కోరారు. చిత్ర దర్శకుడు బాబు యోగేశ్వరన్‌ మాట్లాడుతూ విక్రమ్‌రాథోడ్‌ అద్భుతంగా రూపొందించామన్నారు. రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ భవిష్యత్తులో విజయ్‌ ఆంటోనీతో తెలుగు చిత్రం నిర్మిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు వైజీ మహేంద్రన్‌, డాక్టర్‌ మాధురి, రావూరి బాలాజి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-16T15:58:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!