లైగర్ : మైక్ టైసన్‌ను తొలిసారి సెట్లో కలిసిన విజయ్ దేవరకొండ

ABN , First Publish Date - 2021-11-16T18:21:47+05:30 IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో బాక్సింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా హైప్ రావడానికి ‘లైగర్’ లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

లైగర్ : మైక్ టైసన్‌ను తొలిసారి సెట్లో కలిసిన విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. సాలా క్రాస్ బ్రీడ్ ట్యాగ్ లైన్ తో బాక్సింగ్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా హైప్ రావడానికి ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మైక్ నటిస్తున్నాడనగానే సినిమాపై అంచనాలు మరింత భారీగా పెరిగాయి. 



యూఎస్ లో ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. అందులో విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్బంగా తొలిసారిగా ఆయన్ని కలుసుకొన్న విజయ్ దేవరకొండ ఎగ్జైట్ అవుతూ ట్వీట్ చేశారు. బాక్సింగ్ బీస్ట్ మైక్ టైసన్ తో ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ. ‘దిస్ మేన్ ఈజ్ లవ్.. ప్రతీ క్షణం ఆయన మెమరీస్ ను పోగేసుకుంటున్నాను. కానీ ఇది ఎప్పుడూ చాలా ప్రత్యేకం. వెన్ ఐ కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ ఐరన్’  వ్యాఖ్యను జతచేశారు విజయ్. ఒకప్పుడు ప్రపంచ బాక్సింగ్ రంగాన్నే శాసించిన మైక్ టైసన్ లైగర్ లో విలన్ గా నటిస్తున్నారో లేదో తెలీదు కానీ.. ఈ సినిమా మాత్రం విజయ్ దేవరకొండ కి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందనడంలో సందేహమే లేదు. 



Updated Date - 2021-11-16T18:21:47+05:30 IST