విజయ్‌... ‘బీస్ట్‌’!

ABN , First Publish Date - 2021-06-22T05:42:24+05:30 IST

తమిళ కథానాయకుడు విజయ్‌, దర్శకుడు నెల్సన్‌ దిలీ్‌పకుమార్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే...

విజయ్‌...  ‘బీస్ట్‌’!

తమిళ కథానాయకుడు విజయ్‌, దర్శకుడు నెల్సన్‌   దిలీ్‌పకుమార్‌ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘బీస్ట్‌’ టైటిల్‌ ఖరారు చేశారు. విజయ్‌ పుట్టినరోజు (మంగళవారం - జూన్‌ 22) సందర్భంగా సోమవారం టైటిల్‌ ప్రకటించారు. అలాగే, సినిమాలో విజయ్‌ లుక్‌ సైతం విడుదల చేశారు. అభిమానులకు ఈ లుక్‌ ఆకట్టుకుంది. విజయ్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2021-06-22T05:42:24+05:30 IST