‘పుష్ప’ పిచ్చెక్కిపోతోంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫిక్స్: విజయ్ దేవరకొండ

ABN , First Publish Date - 2021-12-15T23:57:24+05:30 IST

‘పుష్ప’ చిత్రం కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. చిత్ర రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కాగా చూస్తానని తెలియజేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో

‘పుష్ప’ పిచ్చెక్కిపోతోంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఫిక్స్: విజయ్ దేవరకొండ

‘పుష్ప’ చిత్రం కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాను. చిత్ర రిలీజ్ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కాగా చూస్తానని తెలియజేశారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ వేదికగా ‘పుష్ప’ మాసివ్ హిట్ అవ్వాలని కోరుతూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 


‘‘రెండు రోజుల్లో ‘పుష్ప’ చిత్రం వచ్చేస్తుంది. దీనికోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానంటే.. పిచ్చెక్కిపోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కా. ట్రైలర్, సాంగ్స్, విజువల్స్, పెర్ఫార్మెన్స్.. అంతా మాస్. నెక్ట్స్ లెవల్ తెలుగు సినిమా. ఈ చిత్రం మాసివ్ సక్సెస్ సాధించాలని అల్లు అర్జున్ అన్నకి, రష్మికకు, సుకుమార్ సార్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని విజయ్ దేవరకొండ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


విజయ్ ట్వీట్‌‌కు బదులిస్తూ.. ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్.. ఈ చిత్రం మీ హృదయాలను గెలుచుకుంటుందని ఆశిస్తున్నాను. స్పందన కోసం వేచి చూస్తున్నాను. శుక్రవారం రోజు తగ్గేదే లే..’’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.Updated Date - 2021-12-15T23:57:24+05:30 IST