Vijay Devarakonda: ప్రైవేట్ ఫ్లైట్‌లో తిరుపతికి
ABN, First Publish Date - 2021-10-11T20:47:19+05:30
విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులంతా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తిరుమల వెళ్లడం సాధారణ విషయమే కానీ.. ఆయన ఎలా వెళ్లాడు అన్నది ఆసక్తికరంగా మారింది. తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ స్పెషల్ ఫ్లైట్‌లో తిరుపతి చేరుకున్నారు.
విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులంతా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తిరుమల వెళ్లడం సాధారణ విషయమే కానీ.. ఆయన ఎలా వెళ్లాడు అన్నది ఆసక్తికరంగా మారింది. తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ స్పెషల్ ఫ్లైట్‌లో తిరుపతి చేరుకున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తిరుపతి ప్రయాణం వెనుక జరిగింది ఇదే! అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘ప్రైవేట్ ఫ్లైట్‌లో ఫస్ట్ టైం ప్రయాణిస్తున్నాం. ఫ్యామిలీతో ప్రయాణం ఎంతో సరదాగా ఉంది. పైగా ‘పుష్పక విమానం’ సినిమా కూడా థియేటర్లోకి రాబోతోంది. నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేశాం’’ ఆనంద్ చెప్పుకొచ్చాడు.