విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'

ABN , First Publish Date - 2021-01-18T16:47:41+05:30 IST

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డాషింగ్‌ హీరో పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'లైగర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, డాషింగ్‌ హీరో పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సోమవారం  ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాకు 'లైగర్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. లైగర్‌ అంటే సింహం, పులికి పుట్టే బిడ్డ అని అర్థం. టైటిల్‌కు తగ్గట్లే ఫస్ట్‌లుక్‌ను డిజైన్‌ చేశారు. జులపాలతో విజయ్‌ దేవరకొండ బాక్సింగ్‌ గ్లవ్స్‌ వేసుకుని నిలుచుంటే అతని వెనుక సింహం, పులి సగం సంగం ముఖాలను పెట్టి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 'సాలా క్రాస్‌ బ్రీడ్‌' సినిమా ట్యాగ్‌ లైన్‌. ప్యాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతుంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకాలపై పూరీ జగన్నాథ్‌, ఛార్మి, అపూర్వ మెహతా, హీరూ యష్‌ జోహార్‌ నిర్మిస్తున్నాయి. 
Updated Date - 2021-01-18T16:47:41+05:30 IST