సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విద్యా... ప్రతీక్‌... భార్యాభర్తలుగా!

ABN, First Publish Date - 2021-06-20T06:06:20+05:30

‘స్కామ్‌ 1992’ వెబ్‌ సిరీ్‌సతో వెలుగులోకి వచ్చిన నటుడు ప్రతీక్‌ గాంధీ. గతంలో ‘లవ్‌ యాత్రి’లో హీరో స్నేహితుడిగా, ‘మిత్రోం’ చిత్రంలో ముగ్గురు హీరోల్లో ఒకరిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్కామ్‌ 1992’ వెబ్‌ సిరీ్‌సతో వెలుగులోకి వచ్చిన నటుడు ప్రతీక్‌ గాంధీ. గతంలో ‘లవ్‌ యాత్రి’లో హీరో స్నేహితుడిగా, ‘మిత్రోం’ చిత్రంలో ముగ్గురు హీరోల్లో ఒకరిగా నటించిన అతడికి మంచి పాత్ర లభించింది. విద్యా బాలన్‌కు భర్తగా నటించే అవకాశం ప్రతీక్‌ తలుపు తట్టింది. ‘తుమ్హారీ సులు’ నిర్మాతలు తనూజ్‌ గార్గ్‌, అతుల్‌తో విద్యా బాలన్‌ మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి యాడ్‌ ఫిల్మ్‌మేకర్‌ షిర్షా గుహ ఠకురతా దర్శకురాలు. గతంలో రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశారామె. భార్యాభర్తలైన రెండు జంటల చుట్టూ కథ సాగుతుంది. అందులో ఓ జంటగా ప్రతీక్‌ గాంధీ, విద్యా బాలన్‌ కనిపించనున్నారు. వీళ్లిద్దరి జంట సినిమాలో హైలైట్‌ అవుతుందని టాక్‌. ఈ ఏడాది సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.


Updated Date - 2021-06-20T06:06:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!