సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అల్లు అర్జున్ 'ఐకాన్' ఉంది.. వేణు శ్రీరామ్

ABN, First Publish Date - 2021-03-20T22:10:14+05:30

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అట్టహాసంగా మొదలవుతాయి. పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. త్వరలోనో..వచ్చే నెల నుంచో రెగ్యులర్ షూటింగ్ అంటూ ప్రకటన కూడా ఇచ్చేస్తారు. ఆ తర్వాత కారణాలు ఏవైనప్పటిక్లి ప్రాజెక్ట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు అట్టహాసంగా మొదలవుతాయి. పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. త్వరలోనో..వచ్చే నెల నుంచో రెగ్యులర్ షూటింగ్ అంటూ ప్రకటన కూడా ఇచ్చేస్తారు. ఆ తర్వాత కారణాలు ఏవైనప్పటిక్లి ప్రాజెక్ట్ పెండింగ్‌లో పడుతుంది. దాదాపు అందరూ ఆ ప్రాజెక్ట్ గురించి మర్చిపోతున్న సమయమలో ఎవరిదో ఒకరి బర్త్ డే అకేషన్ సందర్భంగా ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసి ఆ ప్రాజెక్ట్ గురించి చిన్న అప్‌డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తారు. మళ్ళీ మర్చిపోతారు. ప్రస్తుతం ఒక క్రేజీ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ విషయంలో ఇలాగే జరుగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్' అన్న సినిమాని ప్రకటించాడు దిల్ రాజు.


వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో రక రకాల చర్చలు కూడా సాగాయి. కానీ ఎందుకనో ప్రాజెక్ట్ పెండింగ్ పడింది. నా పేరు సూర్య సినిమా ఫ్లాపవడంతో అల్లు అర్జున్ ఈ సినిమాని పక్కన పెట్టి 'అల వైకుంఠపురములో' చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత 'ఐకాన్' మొదలవుతుందనుకుంటే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అన్న సినిమాని ప్రకటించాడు. 5 భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. దాంతో ఐకాన్ లేదనుకున్నారు.




కానీ గత ఏడాది అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా 'ఐకాన్' పోస్టర్‌తో విషెస్ చెబుతూ దిల్ రాజు బృదం ఈ సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ ఈ సినిమాకి సంబంధించిన న్యూసేది లేదు. కాగా తాజాగా 'వకీల్ సాబ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌తో 'ఐకాన్' సినిమా చేయాల్సి ఉందంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇన్నాళ్ళు లేదన్న ప్రాజెక్ట్ ఉందంటూ క్లారిటీ ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానుల్లో ఆనందం మామూలుగా లేదట. అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక 'ఐకాన్' ఉంటుందా లేదా ముందే ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.  


Updated Date - 2021-03-20T22:10:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!