సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rana Naidu : బాబాయ్ అబ్బాయ్ వెబ్ సిరీస్

ABN, First Publish Date - 2021-09-22T16:43:52+05:30

బాబాయ్ విక్టరీ వెంకటేష్ , అబ్బాయ్ రానా స్ర్కీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. ఇతర యంగ్ హీరోలతో పలు మల్టీస్టారర్స్ చేసిన వెంకీ.. ఇప్పుడు అబ్బాయ్ రానా తోనూ నటించే తరుణం ఆసన్నమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాబాయ్ విక్టరీ వెంకటేష్ , అబ్బాయ్ రానా స్ర్కీన్ షేర్ చేసుకుంటే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. ఇతర యంగ్ హీరోలతో పలు మల్టీస్టారర్స్ చేసిన వెంకీ..  ఇప్పుడు అబ్బాయ్ రానా తోనూ  నటించే తరుణం ఆసన్నమైంది. వీరిద్దరితోనే త్వరలోనే నెట్ ఫ్లిక్స్ వారు ఒక అదిరిపోయే వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని వారు అఫీషియల్ గా ప్రకటించారు.  దానికి ‘రానా నాయుడు’ అనే మాసీ టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇంతకు ముందు మేనల్లుడు నాగచైతన్యతో కలిసి  ‘వెంకీమామ’ సినిమాలో నటించిన వెంకటేష్ .. ఇప్పుడు తన సొంత అన్నకొడుకైన రానా దగ్గుబాటితో నటించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. 


అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకున్న నెట్ ఫ్లిక్ వెబ్ సిరీస్ ‘రే డోనవన్’ కిది అడాప్టేషన్ అని తెలుస్తోంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ గా రూపొందుతోంది. లోకోమోటివ్ ఐ.యన్.సి గ్లోబల్ నిర్మాణంలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ అన్షుమన్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. ఈ కాంబినేషన్ గురించి వెంకీ మాట్లాడుతూ.. ‘ఈ వెబ్ సిరీస్ లో నటించడానికి రానా ఎంతో తొందరపడుతున్నాడు. ఎందుకంటే.. రానాకి ‘రే డోనవన్’  సిరీస్ అంటే చాలా ఇష్టం’ అన్నారు. ఇక ఇందులోని ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 




Updated Date - 2021-09-22T16:43:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!