ఆకట్టుకుంటోన్న ‘వ‌సంత కోకిల‌’ టీజ‌ర్‌

ABN , First Publish Date - 2021-06-25T23:18:32+05:30 IST

ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్నడ భాష‌ల్లో.. జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిన‌‌ ట్రైలింగ్వల్ మూవీ

ఆకట్టుకుంటోన్న ‘వ‌సంత కోకిల‌’ టీజ‌ర్‌

ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా తెలుగు, త‌మిళ, క‌న్నడ భాష‌ల్లో.. జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిన‌‌ ట్రైలింగ్వల్ మూవీ 'వ‌సంత కోకిల'. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణ సార‌ధ్యంలో నూత‌న ద‌ర్శకుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్తమ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ సింహాకి జోడిగా కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. డైలాగ్స్ లేకుండా కేవ‌లం విజువ‌ల్స్‌తోనే ఉత్కంఠ‌ని క‌లిగించే రీతిన రూపొందిన ఈ టీజ‌ర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ థ్రిల్లర్ జాన‌ర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.


ఈ సందర్భంగా నిర్మాత రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ.. ''జాతీయ అవార్డు గ్రహిత‌, విల‌క్షణ హీరో క‌మ‌లహాస‌న్, శ్రీదేవి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వ‌సంత కోకిల ఏ రేంజ్ స‌క్సెస్ అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ తో తెర‌కెక్కుతున్న మా సినిమాలో మ‌రో జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా న‌టించారు. ఆడియో రైట్స్‌ని థింక్ మ్యూజిక్ కొనుగోలుచేసింది. విడుదలైన టీజర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా జాన‌ర్‌కి, బాబీ సింహా అత్యుత్తమ ప‌ర్ఫార్మెన్స్‌కి త‌గిన విధంగానే ద‌ర్శకుడు ర‌మ‌ణ‌న్ వ‌సంత కోకిలను తెర‌కెక్కించారు. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లోనే తెలియజేస్తాము.." అని అన్నారు.



Updated Date - 2021-06-25T23:18:32+05:30 IST