వరుణ్‌తేజ్‌ 'గని'... ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ విడుదల

ABN , First Publish Date - 2021-01-19T16:17:35+05:30 IST

వరుణ్ తేజ్, కిరణ్ కొర్రపాటి చిత్రానికి 'గని' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

వరుణ్‌తేజ్‌ 'గని'... ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ విడుదల

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు నేడు(జనవరి 19). ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్‌ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో రెనాయిసెన్స్‌ పిక్చర్స్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్ద, అల్లుబాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'గని' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. సినిమాలో వరుణ్‌తేజ్‌ బాక్సర్‌ పాత్రలో కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఆ విషయాన్ని రివీల్‌ చేశారు. ఈ ఏడాది జూలైలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్‌ శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్‌ సి.విలియమ్స్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 



Updated Date - 2021-01-19T16:17:35+05:30 IST