వరుణ్‌ రీ ఎంట్రీ

ABN , First Publish Date - 2021-05-04T10:22:14+05:30 IST

ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించిన వరుణ్‌ సందేశ్‌ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘ఇందువదన’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను...

వరుణ్‌ రీ ఎంట్రీ

ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో హీరోగా నటించిన వరుణ్‌ సందేశ్‌ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటిస్తున్న ‘ఇందువదన’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ సరసన ఫర్నాజ్‌ శెట్టి నటిస్తున్నారు. ఎమ్మెస్సార్‌ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ‘ఇందువదన’ ఫస్ట్‌లుక్‌ చాలా కళాత్మకంగా ఉండడంతో అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు వరుణ్‌సందేశ్‌. 


‘ఇందువదన’ చిత్రానికి సతీష్‌ ఆకేటి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. శివ కాకాని సంగీత దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు. 

Updated Date - 2021-05-04T10:22:14+05:30 IST