ఆకట్టుకుంటోన్న ‘వరుడు కావలెను’ న్యూ పోస్టర్

ABN , First Publish Date - 2021-01-01T23:49:06+05:30 IST

వినూత్న టైటిల్‌తో యంగ్‌ హీరో నాగశౌర్య చేస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రీతువర్మ

ఆకట్టుకుంటోన్న ‘వరుడు కావలెను’ న్యూ పోస్టర్

వినూత్న టైటిల్‌తో యంగ్‌ హీరో నాగశౌర్య చేస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతోంది. 'వరుడు కావలెను' అనే టైటిల్‌తో పాటు ఓ అందమైన వీడియోను కూడా చిత్రయూనిట్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. ఇక 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. చిత్రయూనిట్‌ ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేసింది.  'నాగశౌర్య , రీతువర్మ' ల జంట ఈ ప్రచారచిత్రంలో చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని తెలుపుతూ.. ప్రేక్షకులకు, మీడియా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది చిత్రయూనిట్. 

Updated Date - 2021-01-01T23:49:06+05:30 IST