సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘వరుడు కావలెను’.. సిరివెన్నెల ప్రేమ గీతం విడుదల

ABN, First Publish Date - 2021-09-22T22:55:04+05:30

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా ‘లక్ష్మీ సౌజన్య’ రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 22) ప్రఖ్యాత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగశౌర్య, రీతువర్మ హీరోహీరోయిన్లుగా ‘లక్ష్మీ సౌజన్య’ రూపొందించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 22) ప్రఖ్యాత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాటను ప్రముఖ గాయని చిన్నయి ఆలపించారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.


‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ 

పెదవిదాటి వెలికిరాక బెదురెందుకె హృదయమా

ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం

అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం’’ అంటూ సాగే ఈ పాట చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెరరూపంగా కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగశౌర్య, రీతువర్మల అభినయం ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రఖ్యాత రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి‌గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హృదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను.. అన్నారు. 



Updated Date - 2021-09-22T22:55:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!