వర్మ.. ఏంటీ హడావిడి!

ABN , First Publish Date - 2021-12-27T00:24:55+05:30 IST

అదిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. హనుమకొండలో ఆఖరి షెడ్యూల్‌ పూర్తైన వెంటనే చిత్రబృందం పార్టీ ఏర్పాటు చేసింది. కొండా దంపతులు పాల్గొన్న ఈ పార్టీలో రామ్‌గోపాల్‌ వర్మ హంగామా చేశారు.

వర్మ.. ఏంటీ హడావిడి!

అదిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌  ప్రధాన పాత్రల్లో  దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. హనుమకొండలో ఆఖరి షెడ్యూల్‌ పూర్తైన వెంటనే చిత్రబృందం పార్టీ ఏర్పాటు చేసింది. కొండా దంపతులు పాల్గొన్న ఈ పార్టీలో రామ్‌గోపాల్‌ వర్మ హంగామా చేశారు. తల్వార్‌తో కేక్‌ కట్‌ చేసి హల్‌చల్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.   

రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ ‘‘నేను రాజకీయాలను అంతగా పట్టించుకోను. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి కూడా తెలీదు. ఒక  వ్యక్తి చెప్పగా కొండా మురళి గురించి తెలుసుకున్నా. అప్పుడు ఆయనపై రీసెర్చ్‌ చేశా. హిట్లర్‌ లేకపోతే రెండో ప్రపంచ యుద్థం, గాంధీజీ లేకపోతే భాిరత స్వాతంత్య్ర పోరాటానికి అర్థమే లేదు. గాంధీ ఒకవైపు, హిట్లర్‌ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో  ఉన్నారు. తనను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. ఆయన అనుభవాలు విని విపతీరంగా ప్రభావితం అయ్యాను. నాకు హిట్లర్‌, ముస్సోలిని, ప్రభాకరన్‌ నేపథ్యాలు తెలుసు. వీళ్లందరూ నమ్మిన సిద్థాంతాలు, విలువలు కోసం పోరాడతారు. అటువంటి అంశం నాకు కొండా మురళి జీవితంలో దొరికింది. ఆ తాడును పట్టుకుని ఈ సినిమా తీశా. అందుకే ఈ చిత్రానికి ‘కొండా’ పేరు పెట్టాను. ప్రమాదాన్ని కొండా మురళి కోరి తెచ్చుకున్నారు. ప్రమాదం వస్తుందని భయపడలేదు. దాన్ని చూసి స్ఫూర్తితో సినిమా తీశా. నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్‌ సబ్జెక్ట్‌ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుంది’’ అని అన్నారు.    


Updated Date - 2021-12-27T00:24:55+05:30 IST