విజయ్ థియేటర్‌లో 'వకీల్ సాబ్'..!
ABN, First Publish Date - 2021-03-20T18:56:41+05:30
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ హీరోలుగా సినిమాలు చేస్తూనే సైడ్ బిజినెస్ అంటూ పలు రకాల వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. వీటిలో ముఖ్యంగా మల్టీప్లెక్స్.. హోటల్స్.. సహా రక రకాల బిజినెస్‌లను మొదలు పెడుతునారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ హీరోలుగా సినిమాలు చేస్తూనే సైడ్ బిజినెస్ అంటూ పలు రకాల వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. వీటిలో ముఖ్యంగా మల్టీప్లెక్స్.. హోటల్స్.. సహా రక రకాల బిజినెస్‌లను మొదలు పెడుతున్నారు. కొందరు హీరోలు నిర్మాతలుగా మారి సొంత నిర్మాణ సంస్థలను స్థాపించి యంగ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ అన్న బ్యానర్‌ని స్థాపించి మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలతో కలిసి ఆయన నటిస్తున్న సినిమాలకి భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో వరసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ నిర్మాణంలో మేజర్ అన్న సినిమా రూపొందుతోంది. టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా మహేష్ బాబు మాదిరిగానే ఇప్పటికే నిర్మాణ సంస్థని స్థాపించాడు. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్మెంట్ అన్న బ్యానర్‌లో మీడియం బడ్జెట్ సినిమాలని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 'మీకు మాత్రమే చెప్తా' అన్న సినిమాని నిర్మించాడు. మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కాగా ఇప్పుడు మల్టీప్లెక్స్ రంగలోకి తిగబోతున్నాడు. టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ తో చేతులు కలిపిన దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. విజయ్ దేవరకొండతో కలిసి ఏషియన్ సినిమాస్ మూడు స్క్రీన్లతో మల్టీప్లెక్స్ ను విజయ్ దేవరకొండ స్వస్థలమైన మహబూబ్ నగర్‌లో నిర్మించారు. ఈ కొత్త మల్టీప్లెక్స్‌కి AVD (ఏషియన్ విజయ్ దేవరకొండ) సినిమాస్ అని పేరు పెట్టారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో ఏవీడీ సినిమాస్ గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది.