సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అప్‌డేట్‌ అనౌన్స్‌ చేసిన 'వకీల్‌ సాబ్‌'

ABN, First Publish Date - 2021-01-01T18:59:40+05:30

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. ఈ సినిమా టీజర్ ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్‌ ఏమైనా ఉంటుందేమోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే పవన్‌కల్యాణ్‌, శ్రుతిహాసన్‌ కలిసి ఉన్న ఫొటోను విడుదల చేసింది చిత్రయూనిట్‌. దీంతో పాటు అనౌన్స్‌మెంట్‌ చేసింది. అదేంటంటే.. 'వకీల్‌సాబ్‌' టీజర్‌ను సంక్రాంతికి టీజర్‌ను విడుదల చేస్తారట. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌ సమర్పకుడిగా దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ మూవీ 'పింక్‌'కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్‌ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. పవన్‌కల్యాన్‌ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూడా పూర్తి చేశారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రల్ల నటిస్తున్నారు. 


Updated Date - 2021-01-01T18:59:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!