'వకీల్ సాబ్' కోసం లైటింగ్ బెలూన్లు..ఎంత ఖర్చు పెడుతున్నారో చూడండి..!

ABN , First Publish Date - 2021-03-19T21:49:59+05:30 IST

పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచుతున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా నుంచి మూడవ సాంగ్‌ని రిలీజ్ చేసిన దిల్ రాజు బృందం వినూత్నంగా ప్రమోషన్స్‌ని,

'వకీల్ సాబ్' కోసం లైటింగ్ బెలూన్లు..ఎంత ఖర్చు పెడుతున్నారో చూడండి..!

పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'వకీల్ సాబ్' రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో జోరు పెంచుతున్నారు. ఇటీవలే వకీల్ సాబ్ సినిమా నుంచి మూడవ సాంగ్‌ని రిలీజ్ చేసిన దిల్ రాజు బృందం వినూత్నంగా ప్రమోషన్స్‌ని, ప్రీ రిలీజు ఈవెంట్‌ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ డిలే చేశారని అభిమానుల నుంచి ఒత్తిడెక్కువవుతోంది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఆ అంచనాలను ఇప్పుడు నిర్మాత దిల్ రాజు రెట్టింపు చేసే పనిలో పడ్డాడట. ఇందులో భాగంగా వకీల్ సాబ్ ప్రమోషన్స్‌కి కొత్త టీం దిగితోంది. ప్రతి జిల్లాలోని ఓ ఫ్రధాన నగరంలో కొత్త తరహా బెలూన్లు ఎగరవేయనున్నారు. ఒక్కొక్కటి 30 వేల రూపాయల ఖర్చుతో లైటింగ్ బెలూన్లు తయారుచేయించారు. వీటిపై సినిమా టైటిల్, డేట్ వంటి డీటేయిల్స్ ఉంటాయట. ఇప్పటికే ఆయా నగరాలకు ఈ బెలూన్లు చేర్చినట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు సూచన మేరకు ఈ బెలూన్లను ఎగరవేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.   

    

Updated Date - 2021-03-19T21:49:59+05:30 IST