‘వకీల్ సాబ్’ విడుదల తేదీ వదిలారు
ABN, First Publish Date - 2021-01-30T23:37:16+05:30
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకుడు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్రయూనిట్ గుడ్ న్యూస్ చెప్పేసింది. చిత్ర విడుదల తేదీని శనివారం అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రియల్ 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోన్నట్లుగా చెబుతూ.. చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ చిత్రానికి సంబంధించి సంక్రాంతి కానుకగా విడుదలైన టీజర్ ఎటువంటి స్పందనను రాబట్టుకుందో అందరికీ తెలిసిందే. పవన్‌ను లాయర్ కోటులో చూపించడమే కాకుండా ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్‌ను వదిలారు. టీజర్ ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమా కోసం వెయిటింగ్ అనేలా చేయడంలో సక్సెస్ అయింది. దీంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. వేసవికి ట్రీట్ అన్నట్లుగా చిత్రయూనిట్ విడుదల తేదీ ప్రకటించడంతో.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేశారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు.