వడ్డాణం చుట్టేసి...

ABN , First Publish Date - 2021-10-04T07:26:51+05:30 IST

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ నెల 15న విడుదల కానుంది....

వడ్డాణం చుట్టేసి...

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ నెల 15న విడుదల కానుంది. పెళ్లి నేపథ్యంలో వచ్చే ‘వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు... వయ్యారం చిందేసే అందాల భామలు’ పాటను తాజాగా విడుదల చేశారు. విశాల్‌ చంద్రశేఖర్‌ రఘురామ్‌ రాసిన ఈ గీతాన్ని శ్రీకృష్ణ, గీతా మాధురి, ఎంఎల్‌ గాయత్రి, అదితి భావరాజు, శ్రుతీ రంజనీ ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్రబృందం తెలిపింది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్‌ సమర్పకులు.


Updated Date - 2021-10-04T07:26:51+05:30 IST